Avatar 2 : అవతార్-2 ఓటిటికి వచ్చేది అప్పుడేనంటా..

Kaburulu

Kaburulu Desk

December 24, 2022 | 06:39 PM

Avatar 2 : అవతార్-2 ఓటిటికి వచ్చేది అప్పుడేనంటా..

Avatar 2 : వరల్డ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అవతార్-2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్‌ల వద్ద సందడి చేస్తుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇస్తుంది. విడుదలకు ముందే ఈ చిత్రం పైరసీ రూపంలో వచ్చేసినా, ఆడియన్స్ మాత్రం అవతార్ ని థియేటర్ లోనే చూడాలి అంటున్నారు.

Salaar : సలార్‌కి సీక్వెల్ ఉండబోతుందా?

దీంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది. మొదటిరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ఇండియాలో అయితే మొదటిరోజు రూ.50 కోట్ల కొల్లగొట్టినట్లు చెబుతున్నారు. థియేటర్ల వద్ద ఈ రేంజ్ లో ఆడుతున్న ఈ సినిమా ఓటిటిలోకి రాబోతుంది అంటా.

ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమాని భారీ ధరకి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీని 7 నెలలు తరువాతే విడుదల చేయనున్నారు. అంటే వచ్చే ఏడాది మధ్యలోనే ఈ చిత్రం ఓటిటిలో ప్రసారం కానున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.