Amala Paul : టాలీవుడ్ పై హీరోయిన్ అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు..

Kaburulu

Kaburulu Desk

September 13, 2022 | 12:43 PM

Amala Paul : టాలీవుడ్ పై హీరోయిన్ అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు..

Amala Paul :  మలయాళం సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అమలాపాల్ తెలుగులో బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. అయితే గత కొంతకాలంగా కేవలం తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. తాజాగా తమిళ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

BiggBoss 6 Second Week Nominations : రెండోవారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా..?

అమలాపాల్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ”తెలుగు సినీ పరిశ్రమలో నెపోటిజం ఉంది. అక్కడి పరిశ్రమలో స్టార్ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ అన్ని కమర్షియల్ సినిమాలే ఎక్కువ తీస్తారు. వాళ్ళ సినిమాల్లో గ్లామరస్ కి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇక తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అంటే అందాల ఆరబోతకు మాత్రమే. అందుకే నేను తెలుగు పరిశ్రమతో ఎక్కువగా కనెక్ట్ అవ్వలేకపోయాను. చాలా తెలుగు సినిమాలు నేను రిజెక్ట్ చేశాను” అని వ్యాఖ్యలు చేసింది. దీంతో అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.