Abhishek Bachchan : అభిషేక్-ఐశ్వర్య విడాకులు.. రెండోపెళ్లి మీరే చేయాలని కౌంటర్ ఇచ్చిన అభిషేక్..

Kaburulu

Kaburulu Desk

October 2, 2022 | 01:20 AM

Abhishek Bachchan : అభిషేక్-ఐశ్వర్య విడాకులు.. రెండోపెళ్లి మీరే చేయాలని కౌంటర్ ఇచ్చిన అభిషేక్..

Abhishek Bachchan :  ఇటీవల సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా మాములు అయిపోయింది. బాలీవుడ్ లో ఇది ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ బాలీవుడ్ లో రోజుకో విడాకుల వార్త వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తీసుకోకపోయినా అక్కడి మీడియా ఇష్టమొచ్చినట్టు రాసేస్తారు. తాజాగా అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొన్ని బాలీవుడ్ మీడియాలు రాశాయి.

ఈ ఫేక్ విడాకుల వార్త అభిషేక్ బచ్చన్ దాకా వెళ్లడంతో దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అభిషేక్. 2007లో అభిషేక్, ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి వీరు ఎంతో సంతోషంగా కలిసి ఉంటున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. తాజాగా వీరి విడాకులపై వచ్చిన వార్తలకి అభిషేక్ స్పందించాడు.

Rashmika Mandanna : సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. లైగర్ నాకు నచ్చింది..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ ఈ విషయంపై మాట్లాడుతూ..”నాకు, ఐశ్వర్యకి మధ్య మూడో వ్యక్తి అవసరం లేదు. మేమిద్దరం ఒకరినొకరం ఎంత ప్రేమించుకుంటున్నామో మాకు తెలుసు. మీరు అనుకున్నట్టు మేము విడాకులు తీసుకుంటే అప్పుడు మీరే నా రెండో పెళ్లి చేయాలి” అని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు.