Chiranjeevi : చిరంజీవి మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వని పర్సన్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. సుమ హోస్ట్ చేస్తున్న ఈ షో ఇటీవల ప్రసారం అయ్యింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని పర్సన్ ఎవరన్నది తెలియజేశాడు.

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 11:27 AM

Chiranjeevi : చిరంజీవి మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వని పర్సన్ ఎవరో తెలుసా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ ఫైట్స్, కామెడీ, డాన్స్ లతో అదరగొట్టేశాడు. దీంతో థియేటర్ల వద్ద ఈ సినిమా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ, చిరుకి తమ్ముడిగా నటించాడు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అయిని. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.

Waltair Veerayya Review : పండక్కి బాస్, మాస్ కలిసి కుమ్మేశారు.. వింటేజ్ కామెడీ యాక్షన్ తో బాస్ ఈజ్ బ్యాక్..

తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. సుమ హోస్ట్ చేస్తున్న ఈ షో ఇటీవల ప్రసారం అయ్యింది. ఈ షోకి చిరంజీవితో పాటు డైరెక్టర్ బాబీ, వెన్నెల కిషోర్ కూడా వచ్చారు. ఇక ఈ షోలో చిరంజీవి కొన్ని ఆశక్తికర విషయాల్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని పర్సన్ ఎవరన్నది తెలియజేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు యాంకర్ సుమ.

‘కొన్నేళ్ల క్రితం సుమ బర్త్ డే అని తెలుసుకొని, ఆమె నెంబర్ కనుకొని, ఆమెకు బర్త్ డే విషెస్ మెసేజ్ చేశాను. కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు. అలా ఆ తరువాత కూడా వరుసగా మూడేళ్ళ పాటు మెసేజ్ చేశాను. కానీ ఆమె నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. ఇక నాలుగో సారి డైరెక్ట్ గా ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పాను’ అంటూ చిరంజీవి వెల్లడించాడు.

దానికి సుమ బదులిస్తూ.. ‘సార్ దానికి రీజన్ కూడా మీకు అప్పుడే చెప్పాను. చిరంజీవి గారు నాకు బర్త్ డే విషెస్ చెప్పడం ఏంటి. ఎవరో నాతో ఫ్రాంక్ చేస్తున్నారు అని అనుకున్నాను. మీరు ఫోన్ చేసి చెప్పే వరకు నాకు మీరు అని తెలియదు. తెలిసిన తరువాత మీకు సారీ కూడా చెప్పాను. ఆ తరువాత మీ నెంబర్ కూడా సేవ్ చేసుకున్నాను’ అంటూ తెలియజేసింది.