D Entertainment : ధోని నిర్మాతగా.. తమిళ్ లోనే ఫస్ట్ సినిమా.. హీరో, హీరోయిన్స్ ఎవరో తెలుసా?

D Entertainment : భారత క్రికెట్ కి ఎన్ని విజయాలు అందించి, ఎన్నో సేవలు చేసి ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని లైఫ్ ని ఆస్వాదిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోని. గత కొన్నేళ్లుగా ధోని సినిమాల్లోకి రానున్నాడని, నిర్మాతగా సినిమాలు నిర్మించనున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ధోని అధికారికంగా తన ప్రొడక్షన్ ఆఫీస్ ని ప్రారంభించి తన మొదటి సినిమాని ప్రకటించారు.
ధోని IPL ద్వారా తనకి ఎంతో అనుబంధం ఏర్పడిన చెన్నైలో తన సినిమా ఆఫీస్ ధోని ఎంటర్టైన్మెంట్ ని ప్రారంభించారు. తన మొదటి సినిమా తమిళ్ లోనే తెరకెక్కించి పలు భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ధోని తీయబోయే మొదటి సినిమాకి ధోని భార్య సోనాక్షి కథ అందించగా రమేష్ తమిళమని దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ధోని ఎంటర్టైన్మెంట్ నుంచి అధికారిక ప్రకటన చేశారు.
RRR : అంతర్జాతీయ స్థాయిలో RRR సినిమాకి మరో అవార్డు.. సాటర్న్ అవార్డ్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం..
ఇన్నాళ్లు క్రికెట్ లో ఎన్నో విజయాలు సాధించిన ధోని ఇప్పుడు సినిమా రంగంలో కూడా తన మార్క్ వేయనున్నారు. తమిళ్ లో తన మొదటి సినిమాతో మొదలుపెట్టి వేరే భాషల్లో కూడా త్వరలో సినిమాలు నిర్మిస్తారని తెలిపారు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి. ధోని నిర్మాతగా సినిమా అంటే దేశం మొత్తం ఎదురు చూస్తుంది.
Dhoni Entertainment forays into mainstream film production with a Tamil film ✨#dhonientertainment #tamilcinema @SaakshiSRawat @msdhoni @Ramesharchi @PriyanshuChopra @HasijaVikas pic.twitter.com/LIVMkbEvvc
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) October 25, 2022