Dhamaka : ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ధమాకా..

మాస్ మహారాజ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'ధమాకా'. రవితేజ డ్యూయల్ రోల్ లో డబుల్ ధమాకా ఇవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా రెండు వారాల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 06:35 PM

Dhamaka : ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ధమాకా..

Dhamaka : మాస్ మహారాజ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా’. గత సంవత్సరం రెండు భారీ డిజాస్టర్ లు ఇచ్చిన రవితేజ ఏడాది చివరిలో మాత్రం మర్చిపోలేని విజయాన్ని అందించాడు. త్రినాధ్ రావు నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మొదటిరోజు మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ మూవీ.. రెండో రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం మొదలుపెట్టింది.

Chiranjeevi : రవితేజతో నటించాలి అంటే కోపం వస్తుంది.. చిరంజీవి!

రవితేజ డ్యూయల్ రోల్ లో డబుల్ ధమాకా ఇవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల తన యాక్టింగ్ అండ్ డాన్స్ లతో ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమా రెండు వారాల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. రవితేజ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమా కావడమే కాకుండా మొదటి రూ.100 సాధించిన సినిమాగా నిలిచిపోయింది.

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం కావడంతో, ఓటిటిలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. జనవరి 22 నుంచి ఈ మూవీ ఆడియన్స్ కి ఓటిటిలో అందుబాటులోకి రానుంది. కాగా రవితేజ నటించిన మరో సినిమా ‘వాల్తేరు వీరయ్య’ రేపు విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రవితేజ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. గతంలో అన్నయ్య సినిమా తరువాత వీరిద్దరూ మళ్ళీ ఇప్పుడే కలిసి నటించారు. రవితేజ పవర్ సినిమా తెరకెక్కించిన కె బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.