Waltair Veerayya : అభిమానులను నిరాశపరిచిన వాల్తేరు వీరయ్య..

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి మాస్ మూల విరాట్ రూపంలో దర్శనమిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ముఠామేస్త్రి సినిమా తరువాత బాస్ నుంచి మళ్ళీ ఆ తరహాలో సినిమా రాకపోవడంతో ఇప్పుడు ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Chiranjeevi : మళ్ళీ అదే దారిలో వెళుతున్న చిరంజీవి..
కాగా సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్.. దర్శకనిర్మాతుల నిర్ణయంతో నిరాశకు గురయ్యారు. అదేంటంటే, ఇవాళ మూవీ టీమ్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేశారు. అయితే జనవరి 11న అజిత్ ‘తునివు’ 12న విజయ్ ‘వారిసు’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాల తరువాత చివరిగా థియేటర్లకు వస్తుండడంతో ‘వాల్తేరు వీరయ్య’ ఆ మూడు సినిమాలతో థియేటర్లు పంచుకోవాల్సి వస్తుంది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ లో రికార్డులు క్రియేట్ చేయడం కష్టమని అభిమానులు నిర్మాతలపై మండిపడుతున్నారు. మరి నిర్మాతలు ఫ్యాన్స్ ని ఎలా కూల్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్ర పోషిస్తుండగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.