Urvasivo Rakshasivo : ఊర్వశివో రాక్షసివో ట్రైలర్ రిలీజ్.. ఈ సారి అల్లు శిరీష్ హిట్ కొడతాడా?

Kaburulu

Kaburulu Desk

October 31, 2022 | 08:47 AM

Urvasivo Rakshasivo : ఊర్వశివో రాక్షసివో ట్రైలర్ రిలీజ్.. ఈ సారి అల్లు శిరీష్ హిట్ కొడతాడా?

Urvasivo Rakshasivo :  అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ కి ఒకటి, రెండు యావరేజ్ హిట్ లు తప్ప సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాతో రాబోతున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్ గా నటించగా కొత్త దర్శకుడు రాకేష్ శశి ఈ సినిమాని తెరకెక్కించాడు. అల్లు శిరీష్ సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ నవంబర్ 4న ఈ సినిమాని రిలీజ్ చేయనుంది. ఆదివారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఊర్వశివో రాక్షసివో సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో అను ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ మధ్య ముద్దు సీన్లు ఎక్కువగా చూపించడంతో ఈ సినిమాలో ఫుల్ రొమాన్స్ ఉండబోతుందని అంతా అనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తారు. ఆఫీస్ లో కామెడీ, లవ్, ఈగోలు ఉంటాయి వీరిద్దరి మధ్య. రిలేషన్లోకి వచ్చాక రొమాన్స్ కూడా చేసుకుంటారు. ట్రైలర్ లో కూడా రొమాన్స్, ముద్దు సీన్లు చూపించి సినిమా మీద అంచనాలు పెంచాడు దర్శకుడు. ఇక సునీల్, వెన్నెల కిషోర్ తో ఫుల్ కామెడీ పండించినట్లు తెలుస్తోంది.

Kantara : కాంతార చిత్ర యూనిట్ కి నోటీసులు ఇచ్చిన కోర్టు.. ఆ పాట తొలిగించాలని ఆదేశాలు..

ఊర్వశివో రాక్షసివో సినిమా కథ ఏంటో ట్రైలర్ లో అర్దమవకుండా కట్ చేశారు. అయితే ఇది ఫుల్ రొమాంటిక్ కామెడీ సినిమా అని మాత్రం అర్ధమవుతుంది. చాలా రోజుల నుంచి ఒక మంచి విజయం కోసం చూస్తున్న అల్లు శిరీష్ కి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని ఇస్తుందో చూడాలి. గతంలో గీత ఆర్ట్స్ నుంచి వచ్చిన అల్లు శిరీష్ సినిమాలు కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. దీంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.