Thaikkudam Bridge : కాంతార సినిమాకి లీగల్ నోటీసులు పంపిస్తాం..

Thaikkudam Bridge : ఇటీవల వచ్చిన కన్నడ సినిమా కాంతార భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్స్ సాధించి ఈ సినిమా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహించాడు. దీంతో అంతా రిషబ్ ని అభినందిస్తున్నారు. తాజాగా కాంతార సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది.
కర్ణాటకలో తైక్కుడం బ్రిడ్జ్ అని ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. ఈ బ్యాండ్ పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ని చేస్తుంది. అయితే గతంలో తైక్కుడం బ్రిడ్జ్ నవరసం అనే ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసింది. కాంతార సినిమాలోని వరాహ రూపం పాట మ్యూజిక్ కూడా ఆ నవరసం లాగే ఉందని, అది కాపీ మ్యూజిక్ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు.
Purnaa : వ్యాపారవేత్తతో పూర్ణ పెళ్లి.. ఎప్పుడో పెళ్లి చేసుకొని ఇప్పుడు ఫొటోలు బయటకి..
ఈ మేరకి సోషల్ మీడియాలో తైక్కుడం బ్రిడ్జ్ తమ నవరసం ఫోటో, కాంతార ఫోటోని షేర్ చేస్తూ.. కాంతార సినిమాకి, మాకు ఎటువంటి సంబంధం లేదు. మా నవరస సాంగ్ ని వాళ్ళు కాపీ చేశారు. ఇది పూర్తిగా కాపీరైట్ చట్టాలని ఉల్లంఘించడమే. మేము వారికి లీగల్ గా నోటీసులు పంపించి చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాం అని పోస్ట్ చేశారు. దీనిపై కాంతార చిత్ర యూనిట్ మాత్రం స్పందించకపోవడం విశేషం.