IFFI 2022 : ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించే తెలుగు సినిమాలు ఇవే.. కానీ ఆ సెక్షన్ లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదుగా..

Kaburulu

Kaburulu Desk

October 23, 2022 | 10:42 AM

IFFI 2022 : ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించే తెలుగు సినిమాలు ఇవే.. కానీ ఆ సెక్షన్ లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదుగా..

IFFI 2022 :  ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) గ్రాండ్ గా నిర్వహిస్తారు. గోవాలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సంవత్సరం 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు గోవాలో నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు జరగనున్నాయి. దేశం నలుమూలల నుంచి పలువురు సినీ ప్రముఖులు దీనికి హాజరవుతారు.

Prabhas : బిల్లా రీ రిలీజ్.. అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో కుర్చీలు తగలబెట్టిన వైనం..

ఇటీవల వచ్చిన సినిమాల్లో ఇఫీ జ్యురీ కొన్ని సినిమాలని సెలెక్ట్ చేసి ఇందులో ప్రదర్శించనున్నారు. ఫీచర్ ఫిలిం, నాన్ ఫీచర్ ఫిలిం, ఇండియన్ పనోరమా.. ఈ మూడు కేటగిరీల్లో పలు సినిమాలని ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ నుంచి ఈ సంవత్సరం ఫీచర్ ఫిలిం సెక్షన్ లో అఖండ, RRR, మేజర్ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఇండియన్ పనోరమా సెక్షన్ కింద సినిమా బండి, ఖుదీరాం బోస్ సినిమాలని ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం నాన్ ఫీచర్ ఫిలిం సెక్షన్ లో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం.