Tabu : 50 వేలు పెట్టి అందం కోసం ఓ క్రీమ్ కొన్నాను.. రెండు సార్లు రాశాను.. ఆ తర్వాత..

Kaburulu

Kaburulu Desk

September 26, 2022 | 08:27 AM

Tabu : 50 వేలు పెట్టి అందం కోసం ఓ క్రీమ్ కొన్నాను.. రెండు సార్లు రాశాను.. ఆ తర్వాత..

Tabu :  చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ కోసం తహతహలాడతారు. గ్లామర్ తగ్గితే అవకాశాలు రావేమో అని భయపడి తమ అందాన్ని మెయింటైన్ చేయడానికి భారీగా ఖర్చుపెడతారు. కొంతమంది హీరోయిన్స్ అయితే చాలా వరకు న్యాచురల్ గానే తమ అందాన్ని కాపాడుకుంటారు. ఇక కొంతమంది హీరోయిన్స్ ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళ అందం మాత్రం ఏమాత్రం తగ్గదు.

తెలుగు, తమిళ్, హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్ టబు కూడా ఎంత ఏజ్ వచ్చినా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పటికి కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల టబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అందం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

Nagarjuna : చైతో చేశాను.. నెక్స్ట్ అఖిల్‌తో చేస్తున్నాను.. ఏజెంట్, ఘోస్ట్ కలిసొస్తే ఎలా ఉంటుందో చూడండి..

ఇంటర్వ్యూలో మీరు అందం కోసం స్పెషల్ గా ఏం వాడతారు అని అడగగా టబు మాట్లాడుతూ.. ”గతంలో ఒకసారి నా మేకప్ ఆర్టిస్ట్‌ మీ అందానికి రహస్యం ఏంటి అని నన్ను అడిగింది. నేను ఎలాంటి సీక్రెట్ లేదు అన్నాను. కొన్ని రోజుల తర్వాత నా మేకప్ ఆర్టిస్ట్ నాకు ఓ ఫేస్‌క్రీమ్‌ కొనమని సలహా ఇచ్చింది. దాని ఖరీదు రూ.50 వేలు. తను చెప్పింది కదా అని ఆ క్రీమ్ కొన్నాను. ఆ క్రీమ్ ని ఒక్కసారో, రెండు సార్లో వాడాను అంతే. ఆ తర్వాత మళ్ళీ ఆ క్రీమ్ నే కాదు, అసలు ఎలాంటి క్రీములు, ఫేస్ వాష్ లు వాడలేదు. అసలు అందం కోసం అలాంటివి నేనేమి వాడను” అని తెలిపింది. మరి 50 ఏళ్ళ వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేయడానికి సీక్రెట్ మాత్రం చెప్పలేదు.