Galodu : సుధీర్ ‘గాలోడు’ ట్రైలర్ రిలీజ్.. పక్కా మాస్ కమర్షియల్ సినిమా.. ఇదైనా సుధీర్ ని హీరోగా నిలబడుతుందా??

Kaburulu

Kaburulu Desk

November 4, 2022 | 10:49 AM

Galodu : సుధీర్ ‘గాలోడు’ ట్రైలర్ రిలీజ్.. పక్కా మాస్ కమర్షియల్ సినిమా.. ఇదైనా సుధీర్ ని హీరోగా నిలబడుతుందా??

Galodu :  సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. బుల్లితెరపై తన కామెడీతో, మ్యాజిక్ తో, యాంకరింగ్ తో, డ్యాన్స్.. ఇలా అనేకరకాల ట్యాలెంట్స్ చూపించి తెలుగు ప్రజలకి బాగా దగ్గరయ్యాడు సుధీర్. కష్టపడి పైకి రావడంతో మరింతమంది అభిమానులు ఏర్పడ్డారు. బుల్లితెరపైనే కాక వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరిపిస్తున్నాడు సుధీర్. చిన్న చిన్న క్యారెక్టర్స్ తో మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు సుధీర్.

సుధీర్ హీరోగా గతంలో వచ్చిన సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఒకపక్క సినిమాలలో కమెడియన్ గా చేస్తూనే హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు సుధీర్. తాజాగా గాలోడు టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

Vijay Devarakonda : లైగర్ పోయినా విజయ్ దేవరకొండకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు..??

గాలోడు ట్రైలర్ చూశాక అసలు ఇది చిన్న సినిమా అని ఎక్కడా అనిపించదు. ట్రైలర్ లో ఫుల్ ఫైట్స్, కామెడీ, సాంగ్స్, యాక్షన్ సన్నివేశాలు చూపించారు. ట్రైలర్ చూస్తుంటే ఇది ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా అని అర్ధమవుతుంది. ఫైట్స్ చూస్తుంటే ఇది స్టార్ హీరో సినిమానేమో అన్నట్టు చిత్రీకరించారు. తన మ్యాజిక్ ట్రిక్స్ ని కూడా సినిమాలో వాడినట్టు తెలుస్తుంది. ఇందులో గెహనా సిప్పి హీరోయిన్ గా నటిస్తుంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం సుధీర్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా అయినా సుధీర్ కి మంచి విజయం అందించి హీరోగా నిలబెడుతుందేమో చూడాలి.