Sonal Chauhan: నా డ్రీమ్ నెరవేరింది.. ‘ఆదిపురుష్’ గురించి లీక్ చేసిన సోనాల్ చౌహాన్..

Kaburulu

Kaburulu Desk

September 18, 2022 | 08:55 AM

Sonal Chauhan:  నా డ్రీమ్ నెరవేరింది.. ‘ఆదిపురుష్’ గురించి లీక్ చేసిన సోనాల్ చౌహాన్..

Sonal Chauhan:  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు. వరుసగా ఈ సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత గా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా మొదలై రెండేళ్లు అవుతున్నా సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క పోస్టర్ తప్ప ఎలాంటి సమాచారం లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇటీవల దసరా పండగకి ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినా చిత్ర యూనిట్ నుంచి మాత్రం అధికారిక సమాచారం లేదు. ఇలాంటి సమయంలో హీరోయిన్ సోనాల్ చౌహన్ ఆదిపురుష్ సినిమా గురించి ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

Dulquer Salmaan : నేను సీక్వెల్స్ చేయను.. సీతారామం సినిమాకి సీక్వెల్ ఉండకపోవచ్చు..

తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ లాంటి సినిమాల్లో నటించిన సోనాల్ చౌహన్ త్వరలో నాగార్జున సరసన ఘోస్ట్ సినిమాతో రాబోతుంది. ఇటీవల బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ప్రభాస్ తో నటించడం నా డ్రీమ్. ఒకరోజు సడెన్ గా ఆదిపురుష్ టీం నుంచి నాకు కాల్ వచ్చింది. ఆ సినిమాలో ప్రభాస్ తో కలిసి నేను నటించాను. ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక బాలీవుడ్ ఆదిపురుష్‌కు ముందు, ఆదిపురుష్ తరువాత అని చెప్పుకుంటారు” అని సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పడం, తాను కూడా ఈ సినిమాలో నటించానని లీక్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. త్వరగా సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.