samantha : రిలీజ్ కి రెడీ అయిన సమంత శాకుంతలం.. మరో హిట్ కొడుతుందా??

సమంత గతంలోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మాణంలో పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని శాకుంతలం సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత శకుంతలగా...........

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 01:18 PM

samantha : రిలీజ్ కి రెడీ అయిన సమంత శాకుంతలం.. మరో హిట్ కొడుతుందా??

samantha :  చాలా గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నవంబర్ 16న యశోద సినిమాతో థియేటర్స్ లోకి వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన యశోద సినిమా మంచి విజయాన్ని సాధించి దాదాపు 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కూడా వసూలు చేసింది. చాలా రోజుల తర్వాత సమంతని ఫుల్ లెంగ్త్ లో వెండితెరపై చూడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

యశోద సినిమా సమయంలోనే తనకి మాయోసైటిస్ వ్యాధి సోకిందని, చికిత్స తీసుకుంటున్నాను అని తెలిపి అందరికి షాకిచ్చింది. దీంతో సమంత అభిమానులతో పాటు ప్రేక్షకులు, పలువురు ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. యశోద రిలీజ్ తర్వాత నుంచి అప్పటికే చేతిలో ఉన్న సినిమాలకి బ్రేక్ చెప్పేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది సమంత. ఉన్న షూటింగ్స్ అన్నీ ఆపేయడంతో సమంత నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

అయితే సమంత గతంలోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మాణంలో పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని శాకుంతలం సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత శకుంతలగా మెయిన్ లీడ్ పోషిస్తుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ కూతురు అర్హ శకుంతల చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తుంది.

Sai Pallavi : సినిమాలకి దూరంగా సాయి పల్లవి.. సడెన్ గా పుట్టపర్తిలో ప్రత్యక్షం..

ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్. 2023 ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాని పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. అలాగే ఈ సినిమాని 3D లో కూడా రిలీజ్ చేయనున్నారు. దీంతో సమంత అభిమానులు త్వరలోనే మళ్ళీ తమ హీరోయిన్ ని వెండితెరపై చూడొచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యశోద హిట్ కొట్టడంతో శాకుంతలం సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా పురాణాల్లోని కథ కావడం, సినిమాని అప్పటి కథలాగే చిత్రీకరిస్తుండటంతో హిట్ కొడుతుందా కూడా అని ఆలోచిస్తున్నారు.