RRR : మరో అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ‘RRR’..

Kaburulu

Kaburulu Desk

December 6, 2022 | 11:30 AM

RRR : మరో అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ‘RRR’..

RRR : దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఈ సినిమాకు విశేషమైన ప్రజాధారణ పొందుతుంది.

Rajamouli : రాజమౌళికి ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డు..

హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఈ సినిమాకు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా మరో పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ‘అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ పురస్కారంలో బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ గా ఎంపిక అయ్యి అవార్డుని అందుకుంది.

కాగా ఇటీవలే దర్శకుడు రాజమౌళి కూడా ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌’ వేడుకల్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. ఇక చివరిగా ఆర్ఆర్ఆర్ చూపులు అన్ని ఆస్కార్ పైనే ఉన్నాయి. ఎలైన ఆస్కార్ అందుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చూపడానికి ప్రయత్నిస్తుంది.