RRR : అంతర్జాతీయ స్థాయిలో RRR సినిమాకి మరో అవార్డు.. సాటర్న్ అవార్డ్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం..

Kaburulu

Kaburulu Desk

October 26, 2022 | 09:07 AM

RRR : అంతర్జాతీయ స్థాయిలో RRR సినిమాకి మరో అవార్డు.. సాటర్న్ అవార్డ్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం..

RRR :  చరణ్, తారక్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఈ సినిమాని చూసిన వారంతా దేశ విదేశాల నుంచి సినిమాని, దర్శకుడిని అభినందిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా అమెరికాలోని పలు ఫిలిం ఫెస్టివల్స్ లో రాజమౌళి పాల్గొంటూ RRR సినిమాని మరింత ప్రమోట్ చేశారు. ప్రస్తుతం జపాన్ లో కూడా ఈ సినిమా సందడి చేస్తుంది. ఆస్కార్ కి కూడా జనరల్ కేటగిరిలో ఈ సినిమాని పంపించారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా RRR పేరు ఇంకా మోగుతూనే ఉంది. తాజాగా RRR సినిమాకి మరో హాలీవుడ్ అవార్డు వరించింది.

Thaikkudam Bridge : కాంతార సినిమాకి లీగల్ నోటీసులు పంపిస్తాం..

హాలీవుడ్ లో గత 50 ఏళ్లుగా అవార్డ్స్ ఇస్తున్న సాటర్న్ అవార్డ్స్ ఈ సంవత్సరం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా RRR సినిమాని ప్రకటించింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. రాజమౌళి సాటర్న్ అవార్డ్స్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోని రిలీజ్ చేయగా సాటర్న్ అవార్డ్స్ తమ అధికారిక ట్విట్టర్లో దీన్ని పోస్ట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నెటిజన్లు RRR చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు.