Raviteja : 75 కోట్ల ధమాకా.. 100 కోట్లకి పరుగులు.. ఈ సక్సెస్ వాళ్ళకి అంకితం అంటూ రవితేజ ఎమోషనల్ ట్వీట్..

ధమాకా సినిమా మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాంగ్స్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమా హిట్ కి దోహదపడ్డాయి. ఇక ధమాకా 9 రోజుల్లో 77 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. అంటే దాదాపు...........

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 03:18 PM

Raviteja : 75 కోట్ల ధమాకా.. 100 కోట్లకి పరుగులు.. ఈ సక్సెస్ వాళ్ళకి అంకితం అంటూ రవితేజ ఎమోషనల్ ట్వీట్..

Raviteja :  రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా సినిమా డిసెంబర్ 23న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. రవితేజ గత రెండు సినిమాలు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ నిరాశపరచడంతో ఈ సక్సెస్ రవితేజకి మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఇటీవలే ధమాకా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు చిత్ర యూనిట్.

ధమాకా సినిమా మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాంగ్స్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమా హిట్ కి దోహదపడ్డాయి. ఇక ధమాకా 9 రోజుల్లో 77 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. అంటే దాదాపు 35 కోట్లకి పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఫుల్ ప్రాఫిట్స్ లోఉన్న ధమాకా ఇప్పుడు వేరే పెద్ద సినిమాలు కూడా ఏమి లేకపోవడంతో మరింత దూసుకుపోతుంది. 77 కోట్లు వసూలు చేసిన ధమాకా 100 కోట్లకు పరుగులు తీస్తుంది. ధమాకా సినిమా 100 కోట్లు కనుక సాధిస్తే రవితేజకి మొట్టమొదటి 100 కోట్ల సినిమా అవుతుంది. చూడాలి మరి ఏమవుతుందో.

NTR 30 Update : NTR 30 సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

ఇక ధమాకా సక్సెస్ పై ఓ స్పెషల్ ట్వీట్ చేస్తూ న్యూ ఇయర్ విషెష్ చెప్పాడు రవితేజ. రవితేజ చేసిన ట్వీట్ లో.. 2022లో ధమాకా లాంటి పెద్ద సక్సెస్ ఇచ్చిన నా ఫ్యాన్స్, వెల్ విషర్స్ కి ధన్యవాదాలు. ఈ ధమాకా సక్సెస్ ని 2022లో మనల్ని వదిలేసి వెళ్లిన టాలీవుడ్ సినీ లెజండరీలకి అంకితమిస్తున్నాను. వారి సేవలు మరువలేనివి. 2022లో కష్టమైనా మీ ప్రేమ, సపోర్ట్ తో ముందుకి సాగాను. 2023లో కూడా ఇదే ప్రేమతో మరింత ముందుకు సాగుతాను అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.