Rashmika Mandanna : సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. లైగర్ నాకు నచ్చింది..

Kaburulu

Kaburulu Desk

October 1, 2022 | 01:08 PM

Rashmika Mandanna : సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. లైగర్ నాకు నచ్చింది..

Rashmika Mandanna :  విజయదేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సినిమాపై ముందు నుంచే అంచనాలు బాగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ భారీగా చేసి సినిమా మీద హైప్ పెంచారు.

ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ సినిమా చిత్ర యూనిట్ కి తీవ్ర నిరాశ మిగిల్చింది. సినిమా భారీ పరాజయం చూసింది. దీంతో విజయ్ అభిమానులు కూడా నిరాశ చెందారు. అయితే సినిమా ఫ్లాప్ అయినా చిత్ర యూనిట్ కొన్ని రోజులు హిట్ అంటూ హడావిడి చేశారు. ఫలితం ఏమి మారకపోవడంతో చిత్ర యూనిట్ కూడా సైలెంట్ అయిపోయారు. ఆ సినిమా నెల రోజుల లోపే ఓటీటీలోకి కూడా వచ్చేసింది.

Salman Khan : బిగ్‌బాస్‌ హోస్ట్ చేయడం ఇష్టం లేదు.. 1000 కోట్లు ఇస్తే..

తాజాగా లైగర్ సినిమాపై రష్మిక వ్యాఖ్యలు చేసింది. రష్మిక, విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని కొంతమంది అంటుంటారు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో గుడ్ బై సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మీడియా ప్రతినిధులు లైగర్ సినిమా గురించి రష్మికని అడిగారు.

రష్మిక లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ”నాకు లైగర్ సినిమా నచ్చింది. సాధారణంగానే నాకు కమర్షియల్ సినిమాలంటే ఇష్టం. లైగర్ సినిమా చూసేటప్పుడు విజిల్స్ కూడా వేశాను. సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు. నాకైతే లైగర్ సినిమా నచ్చింది. విజయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఈ మాట చెప్పట్లేదు” అని తెలిపింది. పరాజయం పాలైన లైగర్ సినిమా రష్మికకి నచ్చింది అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.