Rashmika Mandanna : రష్మిక బాలీవుడ్ ఆశలపై నీళ్లు చల్లిన హీరో..

Kaburulu

Kaburulu Desk

December 13, 2022 | 07:08 PM

Rashmika Mandanna : రష్మిక బాలీవుడ్ ఆశలపై నీళ్లు చల్లిన హీరో..

Rashmika Mandanna : పుష్ప బ్యూటీ రష్మిక మందాన బాలీవుడ్‌లోను పాగా వేసేందుకు సిద్దమై ‘గుడ్ బై’ సినిమాతో ప్రయత్నించింది. అమితాబ్ బచ్చన్, రష్మిక తండ్రీకూతుర్లులా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవడంతో, రష్మిక ఆశలన్నీ తన తరువాతి బాలీవుడ్ రిలీజ్ పైనే పెట్టుకుంది.

Pushpa 2 : పుష్ప-2లో రామ్‌చరణ్ అతిధి పాత్ర?

సిద్దార్థ మల్హోత్ర హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మిషన్ మజ్ను’. శంతను బగ్చి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు డైరెక్ట్ ఓటిటి విడుదలకు సిద్ధమైంది. జనవరి 20 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

థియేటర్ కాకుండా డైరెక్ట్ ఓటిటిలో విడుదల అవుతుండడంతో, రష్మిక బాలీవుడ్ ఆశలని నిరాశలు అయ్యిపోయాయి. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన విజయ్ ‘వారిసు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. అలాగే ఈ అమ్మడు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రూల్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.