Unstoppable2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది..

Kaburulu

Kaburulu Desk

December 14, 2022 | 03:19 PM

Unstoppable2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది..

Unstoppable2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా వస్తున్నాడని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్ చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానుల మరియు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగా.. మంగళవారం నాడు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు.

Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్?

ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి గం.11:15 నిమిషాలకు ఆ స్పెషల్ వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. 30 సెకన్లు నిడివి ఉన్న ఈ ప్రోమో కన్నుల పండగలా ఉంది. ఎప్పుడు బ్లాక్ షర్ట్ లేదా లూస్ టి-షర్ట్స్ లో కనపడే ప్రభాస్.. ఈ ఎపిసోడ్ లో గళ్ళ చొక్కాతో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ప్రోమోలో ప్రభాస్.. “రేయ్ ఏమి చెబుతున్నావ్ డార్లింగ్” అంటూ చెప్పిన డైలాగ్ అందర్ని ఎంతగానో ఆకట్టుకుంది.

కాగా ఇదే ఎపిసోడ్ కి ప్రభాస్ తో పాటు అతని బెస్ట్ ఫ్రెండ్ మరియు టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా హాజరయ్యి సందడి చేశాడు. ప్రోమో ఆకట్టుకోవడంతో ఎపిసోడ్ కి సంబంధించిన ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30, 31 తేదీలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ తో బాలయ్య ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.