Praseeda : కృష్ణంరాజు మరణం తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన కూతురు ప్రసీద..

Kaburulu

Kaburulu Desk

October 16, 2022 | 09:28 AM

Praseeda : కృష్ణంరాజు మరణం తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన కూతురు ప్రసీద..

Praseeda :  ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణం ప్రభాస్ కి, ఆయన కుటుంబానికి, టాలీవుడ్ కి తీరని లోటు. తాజాగా కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద మొదటిసారి మీడియా ముందుకి వచ్చి మాట్లాడింది.

ఇటీవల స్టార్ హీరోల పుట్టినరోజులకి గతంలో హిట్ అయిన వాళ్ళ సినిమాలని రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 23న ప్రభాస్ నటించిన బిల్లా సినిమా రీరిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులతో పాటు కృష్ణంరాజు కూతురు ప్రసీద కూడా వచ్చింది.

Nikhil : ఆ సినిమాకి సీక్వెల్ తీయకపోతే ముందు మా అమ్మ ఊరుకోదు..

ఈ ప్రెస్ మీట్ లో ప్రసీద మాట్లాడుతూ.. బిల్లా సినిమా మాకు ఎంతో స్పెషల్. ఈ సినిమాతో మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అన్నయ్య, నాన్న కలిసి చేసిన మొదటి సినిమా బిల్లా. ఈ సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నందుకు మెహర్ రమేష్ అంకుల్ కి చాలా థ్యాంక్స్. ఈ సినిమా రీరిలీజ్ ద్వారా వచ్చే లాభాలని యూకే ఇండియా డయాబెటిక్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌కు అందచేస్తాము అని తెలిపింది.