Pawan Klayan : సూపర్ కాంబో.. RRR నిర్మాత.. సాహో దర్శకుడితో.. పవర్ స్టార్ సినిమా..

Kaburulu

Kaburulu Desk

December 4, 2022 | 02:57 PM

Pawan Klayan : సూపర్ కాంబో.. RRR నిర్మాత.. సాహో దర్శకుడితో.. పవర్ స్టార్ సినిమా..

Pawan Klayan :  పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలని పూర్తి చేయడానికి టైం దొరకట్లేదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. అటు పాలిటిక్స్ కి సమయం కేటాయిస్తూ ఖాళి దొరికినప్పుడు షూటింగ్స్ కి వస్తున్నాడు పవన్. అసలే మరో సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. చేతిలో ఉన్న సినిమాలని పూర్తి చేస్తాడో లేదో అనుకుంటున్నారు అంతా. ఇలాంటి సమయంలో పవన్ మరో కొత్త సినిమాని అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

 

అసలు ఎవరూ ఊహించని విధంగా, కనీసం ఎక్కడా గాసిప్ కూడా రాకుండా RRR సినిమా నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో సాహో సినిమా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ కాంబో చూసి మొదట అంతా ఆశ్చర్యపోయారు. పవన్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడంతో ఇండైరెక్ట్ గా ఆ పోస్టర్ లోనే సినిమా కాన్సెప్ట్ గురుంచి చెప్పేశారు.

Satyadev : గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. మూడు లవ్ స్టోరీలు.. తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. గుర్తుండిపోద్ది..

పవన్ కళ్యాణ్ వెనకకి తిరిగి నించున్న ఫొటోని పోస్ట్ చేసి జపాన్ లో తుఫాను రాబోతుంది అని రాశారు. అలాగే అందరూ అతనో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని పిలుస్తారు అని పోస్టర్ మీద ఇచ్చారు. దీంతో ఈ సినిమా విదేశాల్లో ఉండబోతుంది, ఇందులో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మొదటి సారి కనిపించబోతున్నాడు అని అర్ధమవుతుంది. పవన్ మొదటిసారి గ్యాంగ్‌స్టర్ పాత్ర అనడంతో ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. సాహో సినిమాని హాలీవుడ్ లెవెల్ మేకింగ్ తో తెరకెక్కించిన సుజిత్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడో పవన్ కళ్యాణ్ ని గ్యాంగ్‌స్టర్ గా ఎలా చూపిస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.