Deepthi Ganta : నాని నిర్మాణంలో డైరెక్టర్‌గా నాని సోదరి.. మీట్ క్యూట్ అంటూ రాబోతున్న దీప్తి గంటా..

Kaburulu

Kaburulu Desk

November 12, 2022 | 10:11 AM

Deepthi Ganta : నాని నిర్మాణంలో డైరెక్టర్‌గా నాని సోదరి.. మీట్ క్యూట్ అంటూ రాబోతున్న దీప్తి గంటా..

Deepthi Ganta :  అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా ఎంతో కష్టపడి ఎదిగాడు నాని. సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పెడతాను అంటూ వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థని స్థాపించి మంచి మంచి సినిమాలని తెరకెక్కించాలని, కొత్త దర్శకులకి అవకాశాలు కల్పించాలని ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే నాని నిర్మాణ సంస్థ నుంచి మరో సినిమా రాబోతుంది.

‘మీట్ క్యూట్’ అనే టైటిల్ తో అయిదు భిన్న కథలతో ఓ ఆంథాలజీ సినిమాగా త్వరలో సోని లివ్ ఓటీటీలో రాబోతుంది. అయితే ఈ సినిమాకి దర్శకురాలు నాని సోదరి దీప్తి కావడం విశేషం. నాని అక్క దీప్తి గతంలో ఓ మంచి షర్ట్ ఫిలింని కూడా తెరకెక్కించింది. ఇప్పుడు ఈ మీట్ క్యూట్ సినిమాతో నాని సోదరి దీప్తి తెలుగు పరిశ్రమకి దర్శకురాలిగా పరిచయమవుతుంది. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజయింది.

ఈ మీట్ క్యూట్ సినిమా గురించి దర్శకురాలు దీప్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కరోనా టైంలో ఒక సంవత్సరం అంతా కూర్చొని ఈ స్క్రిప్ట్ రాశాను. ఆరు నెలల్లో సినిమాని తెరకెక్కించాను. రిలీజ్ చేయడానికి ఇంకో సంవత్సరం పట్టింది. త్వరలో ఈ సినిమాని మీ ముందుకి తీసుకురాబోతున్నాను. దీనికి నాకు చాలా సహకరించిన నా తమ్ముడు నానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని పోస్ట్ చేసింది.

Nagashaurya : పెళ్లిపీటలెక్కబోతున్న నాగశౌర్య.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా??

దీనికి నాని రిప్లై ఇస్తూ.. ఇన్నాళ్లు నేను తెలివైన వాడ్ని అనుకున్నాను. కానీ మా అక్క నా కంటే తెలివైంది. అద్భుతమైన సినిమా తెరకెక్కించింది. చిత్ర యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ అని పోస్ట్ చేశాడు. నాని సోదరి దర్శకురాలిగా మారడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.