M M Keeravani : ఎం ఎం కీరవాణి ఇంట విషాదం..

Kaburulu

Kaburulu Desk

December 14, 2022 | 06:39 PM

M M Keeravani : ఎం ఎం కీరవాణి ఇంట విషాదం..

M M Keeravani : టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లో ‘ఎం ఎం కీరవాణి’ ఒకరు. ఈయనతో కెరీర్ మొదలుపెట్టిన సంగీత దర్శకులు అందరూ ఫేడ్ అవుట్ అయిపోయినా, కీరవాణి మాత్రం వరుస సినిమాలు చేస్తూ హిట్టులు అందుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాలకు తన సంగీతం ప్రాణం పోసి మూవీ సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించాడు.

Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్?

ఇక ఇటీవలే అంతర్జాతీయ అవార్డుని కూడా అందుకున్నాడు ఈ టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు. RRR సినిమాకు గాను ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ ప్రకటించే 2022 అవార్డ్స్‌లో “ఉత్తమ సంగీత దర్శకుడు’గా అవార్డుని అందుకున్నాడు. కాగా ఇంతటి ఆనందంలో ఉన్న కీరవాణికి మాతృవియోగం కలిగింది.

కీరవాణి తల్లి భానుమతి గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. కాగా ఈరోజు (బుధవారం) ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో కీరవాణి ఇంట విషాదం చోటు చేసుకొంది. మరి కాసేపటిలో ఆమె మృతదేహాన్ని దర్శకుడు రాజమౌళి ఇంటికి తరలించనున్నారు. రాజమౌళి, కీరవాణికి తమ్ముడు అవుతాడని అందరికి తెలిసిన విషయమే. ఇక ఈ మరణవార్త తెలియడంతో టాలీవుడ్ ప్రముఖులు కీరవాణి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.