Lokesh Kanagaraj : సూర్య ‘రోలెక్స్’ పాత్రతో సినిమా తీస్తా.. లోకేష్ కనగరాజ్!

Kaburulu

Kaburulu Desk

December 13, 2022 | 08:29 PM

Lokesh Kanagaraj : సూర్య ‘రోలెక్స్’ పాత్రతో సినిమా తీస్తా.. లోకేష్ కనగరాజ్!

Lokesh Kanagaraj : లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని సౌత్ టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేర్చేసింది. దీంతో ఈ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు అందరూ ఆశక్తి చూపిస్తున్నారు. సినీ అభిమానులు కూడా ఈ దర్శకుడు తదుపరి సినిమాలపై ఒక కన్ను వేసి ఉంచుతున్నారు.

Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్?

ఇక విషయానికి వస్తే.. ‘విక్రమ్’ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక ప్రత్యేక పాత్రలో కనిపించి నటించిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్రతో సూర్య చేసిన పెర్ఫార్మన్స్ కి అభిమానులు ఫిదా అయ్యిపోయారు. మూవీ మొత్తానికే ఈ క్యారెక్టర్ హైలైట్ గా నిలివడంతో.. ఈ పాత్రతో ఒక మూవీ తీసేసినందుకు సిద్దమయ్యాడు దర్శకుడు.

తాజాగా లోకేష్, కమల్ హాసన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో
లోకేష్ తన తదుపరి సినిమాలు గురించి మాట్లాడుతూ.. “విజయ్ తో సినిమా పూర్తీ అవ్వగానే ‘ఖైదీ’, ‘విక్రమ్’ సీక్వెల్స్ ఉంటాయి. అలాగే ‘రోలెక్స్’ పాత్రతో ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని తప్పకుండా తీస్తాను” అంటూ వెల్లడించాడు. ఇక ఈ వార్త విన్న రోలెక్స్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.