Keerthy Suresh : నేను ఆ టైపు కాదు.. ఆ పరిస్థితే వస్తే సినిమాలు మానేస్తా.. కీర్తి సురేష్!

Kaburulu

Kaburulu Desk

December 6, 2022 | 12:55 PM

Keerthy Suresh : నేను ఆ టైపు కాదు.. ఆ పరిస్థితే వస్తే సినిమాలు మానేస్తా.. కీర్తి సురేష్!

Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ క్యాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో మంచి ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ముందుకు వెళ్తూనే, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. టాలెంట్ ఉన్నవాళ్లని ప్రోత్సహిస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Balakrishna : బాలకృష్ణకు హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్?

తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. “ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని సంగతి తెలుసు. పలువురు హీరోయిన్ లు ఈ విషయం గురించి నాకు చాలాసార్లు చెప్పారు. కానీ నాకు అలంటి ఘటనలు ఎప్పుడు ఎదురుకాలేదు. ఒకవేళ మన ప్రవర్తన బట్టే క్యాస్టింగ్ కౌచ్ కూడా ఉంటుందేమో.

ఏదేమైనా నాకు అటువంటి పరిస్థితి వస్తే మాత్రం సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటా గాని, కమిట్మెంట్ ఇవ్వను. నేను ఆ టైపు కాదు” అంటూ వెల్లడించింది. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో రెండు తెలుగు సినిమాలు. చిరంజీవి భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తుండగా, దసరా సినిమాలో నానికి హీరోయిన్ గా నటిస్తుంది.