Kantara : కాంతార సినిమా ఓటీటీలోకి.. థియేటర్లో మిస్ అయితే ఇక్కడ చూడండి..

Kaburulu

Kaburulu Desk

November 23, 2022 | 11:53 AM

Kantara : కాంతార సినిమా ఓటీటీలోకి.. థియేటర్లో మిస్ అయితే ఇక్కడ చూడండి..

Kantara :  రిషబ్ శెట్టి హీరోగా, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమా కాంతార. కన్నడలో చిన్న సినిమాగా రిలీజయి మంచి విజయం సాధించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజయి భారీ హిట్ కొట్టింది. కాంతార సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా విజయాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ హిట్ అయి దాదాపు 60 కోట్లు కలెక్ట్ చేసింది.

Waltair Veerayya : బాస్ పార్టీ.. చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ ఊర మాస్ సాంగ్..

కాంతార సినిమా రిలీజ్ అయి 50 రోజులు దాటుతున్నా థియేటర్స్ లో ఇంకా నడుస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో అర్ధమవుతుంది. తాజాగా కాంతార సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో కాంతార సినిమా నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయన్ని అధికారికంగా చిత్ర యూనిట్ తెలిపారు. థియేటర్స్ లో ఈ సినిమాని మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడటానికి రెడీ అయిపోయారు. థియేటర్లలో పలు రికార్డులు క్రియేట్ చేసిన కాంతార సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.