Kantara : IMDB లో కూడా టాప్ ప్లేస్ కొట్టేసిన కాంతార

Kaburulu

Kaburulu Desk

October 21, 2022 | 10:12 AM

Kantara : IMDB లో కూడా టాప్ ప్లేస్ కొట్టేసిన కాంతార

Kantara :  రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా కాంతార. KGF నిర్మాతలు తెరకెక్కించిన ఈ సినిమా మొదట కన్నడలో రిలీజయి భారీ విజయం సాధించింది. గత వారం తెలుగు, హిందీలో రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాకి అన్ని చోట్ల అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే దాదాపు 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం ఆశ్చర్యం. సినిమా మౌత్ టాక్ తోనే మంచి విజయం సాధించింది.

Unstoppable 2nd Episode : అన్‌‍స్టాపబుల్ షో సెకండ్ ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి రచ్చ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్

త్వరలో మరిన్ని భాషల్లో రిలీజ్ చేయాలనీ ఆలోచిస్తున్నారు చిత్ర యూనిట్. కాంతారా సినిమా యిప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. ప్రేక్షకులే కాక పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాని అభినందిస్తున్నారు. తాజాగా కాంతార సినిమాకి మరో గౌరవం దక్కింది. సినిమా రేటింగ్స్ ఇచ్చే IMDB సంస్థ తాజాగా రిలీజ్ చేసిన ఇండియా టాప్ 250 సినిమాలలో కాంతార మొదటి ప్లేస్ లో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకులు ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా నవంబర్ 17 వరకు ఉన్న రేటింగ్స్ ఆధారంగా ఈ లిస్ట్ ఇచ్చినట్టు తెలిపారు.