Dulquer Salmaan : నేను సీక్వెల్స్ చేయను.. సీతారామం సినిమాకి సీక్వెల్ ఉండకపోవచ్చు..

Kaburulu

Kaburulu Desk

September 18, 2022 | 08:49 AM

Dulquer Salmaan : నేను సీక్వెల్స్ చేయను.. సీతారామం సినిమాకి సీక్వెల్ ఉండకపోవచ్చు..

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా సీతారామం. తరుణ్ భాస్కర్, రష్మిక, భూమిక, సుమంత్, గౌతమ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా సౌత్ లో రిలీజ్ అయి మంచి విజయం సాధించి క్లాసిక్ సినిమాలా నిలిచింది. కలెక్షన్లని కూడా భారీగా రాబడుతుంది. తాజాగా సీతారామం సినిమా హిందీలో కూడా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో సీతారామం చిత్ర యూనిట్ బాలీవుడ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో గత కొన్ని రోజులుగా దీనికి సీక్వెల్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తాజా ప్రెస్ మీట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

Akkineni Amala : అందుకే సినిమాలు ఒప్పుకోవట్లేదు.. నాగార్జునతో మళ్ళీ సినిమా చేయను

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ”నేను నటుడ్ని అవ్వకముందే ప్రేక్షకుల మెప్పు పొంది, పెద్ద క్లాసిక్ గా నిలిచిన సినిమాలని అసలు టచ్ చేయకూడదు అని, వాటికి సీక్వెల్స్, రీమేక్స్ లాంటివి తీయకూడదని నిర్ణయించుకున్నాను. సీతారామం సినిమా కూడా మంచి విజయం సాధించి ఒక క్లాసిక్ సినిమాలా నిలిచింది. అటువంటి క్లాసిక్ ని మళ్ళీ టచ్ చేయకూడదని నా అభిప్రాయం. అందుకే సీతారామం సినిమాకి సీక్వెల్ ఉండదనే నేను అనుకుంటున్నాను” అని తెలిపారు. దీంతో సీతారామం సినిమాకి సీక్వెల్ ఉండదనే తెలుస్తుంది.