DJ Tillu 2 : డీజే టిల్లు సీక్వెల్ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ అనౌన్సమెంట్ ఒకేసారి చేసేశారుగా.. దివాళీ దావత్ మాములుగా లేదు..

Kaburulu

Kaburulu Desk

October 24, 2022 | 01:28 PM

DJ Tillu 2 : డీజే టిల్లు సీక్వెల్ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ అనౌన్సమెంట్ ఒకేసారి చేసేశారుగా.. దివాళీ దావత్ మాములుగా లేదు..

DJ Tillu 2 :  సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా ఇటీవల వచ్చిన డీజే టిల్లు సినిమా భారీ విజయం సాధించింది. యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. కలెక్షన్స్ కూడా బాగా వచ్చి సినిమాలో నటించిన వాళ్లంతా స్టార్స్ అయిపోయారు రాత్రికి రాత్రి. ఈ సినిమా బాగా హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు.

తాజాగా దివాళీ సందర్భంగా డీజే టిల్లు సీక్వెల్ టైటిల్ ని రివీల్ చేస్తూ ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. సీక్వెల్ కి టిల్లు 2 అనే టైటిల్ ని ప్రకటించారు. ఇక గ్లింప్స్ లో హీరో సిద్ధూ తాగి వచ్చి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తో గొడవ పడటం చూపించారు. ఇది కూడా ఫన్నీగా ఉంది. ఈ గ్లింప్స్ తోనే సినిమా కూడా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమైపోతుంది.

Chiranjeevi : అందరూ అనుకున్న టైటిలే పెట్టారుగా.. బాస్ ఊర మాస్ సినిమా రాబోతుంది..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది ఇందులో. డీజే టిల్లు సీక్వెల్ ని మరో దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. సమ్మర్ కానుకగా మార్చ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.