Dhoni : లవ్‌టుడే హీరోయిన్‌తో లెట్స్ గెట్ మ్యారీడ్ అంటున్న ధోని..

తాజాగా నేడు ధోని ఎంటర్టైన్మెంట్ నుంచి మొదటి సినిమాని ప్రకటించారు. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ధోని భార్య సాక్షి సింగ్ ధోని నిర్మాణంలో రమేష్ తమిళమని దర్శకత్వంలో హరీష్ కళ్యాణ్ హీరోగా, లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా................

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 02:44 PM

Dhoni : లవ్‌టుడే హీరోయిన్‌తో లెట్స్ గెట్ మ్యారీడ్ అంటున్న ధోని..

Dhoni :  టీమిండియా మాజీ కెప్టెన్ ధోని క్రికెట్ లో ఎంతో సక్సెస్ సాధించాడు. ఇప్పుడు సినిమాల్లో సక్సెస్ సాధించాలని అడుగులు వేస్తున్నాడు. ధోని ఎంటర్టైన్మెంట్ అనే సంస్థని స్థాపించి మొదట తమిళ్ లో, ఆ తర్వాత వేరే భాషల్లో సినిమాలు తీస్తాను అని గతంలోనే ప్రకటించాడు ధోని. చెన్నైలో ధోని ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి ఆఫీస్ కూడా ఓపెన్ చేశాడు.

తాజాగా నేడు ధోని ఎంటర్టైన్మెంట్ నుంచి మొదటి సినిమాని ప్రకటించారు. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ధోని భార్య సాక్షి సింగ్ ధోని నిర్మాణంలో రమేష్ తమిళమని దర్శకత్వంలో హరీష్ కళ్యాణ్ హీరోగా, లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా, కమెడియన్ యోగిబాబు, నదియా ముఖ్య పాత్రల్లో లెట్స్ గెట్ మ్యారీడ్ (LGM) అనే టైటిల్ తో సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే షూట్ కి వెళ్లనుంది.

Haripriya : KGF నటుడిని పెళ్లి చేసుకున్న నాని హీరోయిన్..

ప్రస్తుతం ఇవానా లవ్ టుడే సినిమాతో ట్రేండింగ్ లో ఉంది. కమెడియన్ యోగిబాబు కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇలా ట్రేండింగ్ ని పట్టుకొని యూత్ లవ్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ తో ధోని వస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ధోని సినిమా నిర్మిస్తుండటంతో తమిళ్ లోనే కాదు దేశమంతటా ఈ LGM సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.