Adipurush : ప్రభాస్ కి నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు.. ముదురుతున్న ఆదిపురుష్ వివాదం..

Kaburulu

Kaburulu Desk

October 11, 2022 | 01:14 PM

Adipurush : ప్రభాస్ కి నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు.. ముదురుతున్న ఆదిపురుష్ వివాదం..

Adipurush :  ఆదిపురుష్ టీజర్ రిలీజయిన దగ్గర్నుంచి టీజర్ పై, చిత్ర యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయణం సినిమా అని చెప్పి ఇష్టమొచ్చినట్టు పాత్రలు డిజైన్ చేశారని దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు సినిమా బృందంపై మండిపడుతున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆదిపురుష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా ఓ హిందూ సంస్థ ఆదిపురుష్ పై కోర్టులో కేసు వేసింది. ఆదిపురుష్ చిత్ర యూనిట్ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తుందని, టీజర్ హిందూ దేవుళ్ళని కించపరిచేవిధంగా ఉందని ఓ హిందూ సంస్థ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. సినిమా రిలీజ్ పై స్టే విధించాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రభాస్ తో పాటు ఆదిపురుష్ చిత్ర యూనిట్ కి నోటీసులు పంపింది.

Vijay Devarakonda : లైగర్ ఫ్లాప్ తర్వాత మొదటిసారి మాట్లాడిన విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న స్పీచ్

ఈ వివాదం కోర్టు వరకు వెళ్లడంతో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలని కొంతమంది కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.