Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ నుంచి పాట లీక్ చేసిన చిరు..

Kaburulu

Kaburulu Desk

December 14, 2022 | 07:21 PM

Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ నుంచి పాట లీక్ చేసిన చిరు..

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ వింటేజ్ లుక్‌తో దర్శనమిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ముఠామేస్త్రి తరహాలో ఈ మూవీ పక్కా మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే సినిమాలోనే పాటలు చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఫ్రాన్స్ వెళ్లారు.

Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్?

ఈ క్రమంలోనే అక్కడ వణికించే చలిలో చిరంజీవి, హీరోయిన్ శృతిహాసన్ పై ఒక డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నాడు బాబీ. కాగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో చిరు తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. సాయంత్రం 6 గంటలకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు, అందుకోసం తన ఇన్‌స్టాగ్రామ్ ని గమనిస్తూ ఉండండి అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో మెగా ఫ్యాన్స్ అంత ఎదురు చూడగా, చిరంజీవి సినిమాలోని.. ‘‘నువ్వు శ్రీదేవైతే.. నేనే చిరంజీవంటా’’ అంటూ సాగే పాటని లీక్ చేశాడు. ఫ్రాన్స్ లోని షూటింగ్ లొకేషన్స్ ని చూపిస్తూ, అక్కడ చిత్ర యూనిట్ మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో సాంగ్ షూటింగ్ కోసం కష్టపడుతున్నారు అంటూ తెలియజేస్తూ ఒక చిన్న వీడియోని పోస్ట్ చేశాడు చిరు. ఇక ఈ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.