Bomma BlockBuster : బొమ్మ బ్లాక్‌బస్టర్.. మరోసారి రష్మీ రొమాన్స్.. హిట్ కొట్టేయడానికి రెడీ అయిపొయిందిగా..

Kaburulu

Kaburulu Desk

October 23, 2022 | 10:30 AM

Bomma BlockBuster : బొమ్మ బ్లాక్‌బస్టర్.. మరోసారి రష్మీ రొమాన్స్.. హిట్ కొట్టేయడానికి రెడీ అయిపొయిందిగా..

Bomma BlockBuster :  నందు హీరోగా, రష్మీ హీరోయిన్ గా తెరకెక్కిన బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా కరోనా ముందే షూటింగ్ అయిపొయింది. టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ కరోనా వల్ల రెండేళ్లు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే మళ్ళీ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి నవంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర యూనిట్.

తాజాగా బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం.. ఇందులో హీరో వాళ్ల నాన్న, హీరో పూరి జగన్నాధ్ ఫ్యాన్ అని, ఒక కథ రాసి హైదరాబాద్ వెళ్లి పూరి జగన్నాధ్ కి ఆ కథ వినిపించాలని ప్లాన్ చేసుకుంటారు. ఇక హీరోయిన్ కి గొడవలు అంటే ఇష్టమని హీరో గొడవలు పెట్టుకుంటే పిలిచి మరీ చూపిస్తాడు. విలన్ కి, హీరోకి మధ్య ఓ గొడవ అయితే ఆ గొడవ చుట్టే కథ తిరుగుతుందని తెలుస్తుంది. ఇక రష్మీ మరోసారి రొమాన్స్ తో రెచ్చిపోయింది. నందు, రష్మీ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇందులో హీరో, అతని ఫ్రెండ్స్ నాటకాలు కూడా వేస్తున్నట్టు చూపించాడు. ట్రైలర్ చూడటానికి ఆసక్తికరంగా ఉంది.

Kantara : IMDB లో కూడా టాప్ ప్లేస్ కొట్టేసిన కాంతార

గతంలో రష్మీ గుంటూరు టాకీస్ లో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసి అందర్నీ మెప్పించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. దీంట్లో కూడా నందుతో మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటం, ప్రమోషన్స్ కూడా వీర లెవల్లో చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి నవంబర్ 4న రిలీజ్ అయ్యే ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.