Avatar 3 : అవతార్ 3 కథ ఇదేనా?? భూమి, నీరు అయిపొయింది నెక్స్ట్??

అవతార్ 2 సినిమా కూడా భారీ విజయం సాధించి ప్రేక్షకులని మెప్పించింది. కలెక్షన్స్ కూడా వేలకోట్లలో వస్తున్నాయి. ఇక ఈ విజువల్ వండర్ కి అవార్డులు రావడం కూడా మొదలైంది. అలాగే తర్వాత అవతార్ 3, 4, 5 సినిమాలు కూడా వస్తాయని ప్రకటించాడు జేమ్స్ కామెరూన్.................

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 06:22 PM

Avatar 3 : అవతార్ 3 కథ ఇదేనా?? భూమి, నీరు అయిపొయింది నెక్స్ట్??

Avatar 3 :  హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన జేమ్స్ కామెరూన్ కొన్నేళ్ల క్రితం అవతార్ సినిమాతో వచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు. ఒక విజువల్ వండర్ లాంటి ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించి భారీ కలెక్షన్స్ సాధించింది. ఆ సినిమాకి నెక్స్ట్ పార్ట్ ఉంటాయని అప్పుడే చెప్పినా దాదాపు పదేళ్లకు పైగా సమయం తీసుకొని ఇటీవలే 2022 డిసెంబర్ లో అవతార్ 2ని రిలీజ్ చేశారు.

అవతార్ 2 సినిమా కూడా భారీ విజయం సాధించి ప్రేక్షకులని మెప్పించింది. కలెక్షన్స్ కూడా వేలకోట్లలో వస్తున్నాయి. ఇక ఈ విజువల్ వండర్ కి అవార్డులు రావడం కూడా మొదలైంది. అలాగే తర్వాత అవతార్ 3, 4, 5 సినిమాలు కూడా వస్తాయని ప్రకటించాడు జేమ్స్ కామెరూన్. అవతార్ 1 కథ భూమి మీద పాండోరా గ్రహంలో జరిగితే, అవతార్ 2 కథ నీళ్ళల్లో జరిగింది. ఇప్పుడు అవతార్ 3 కథ ఏంటి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల హాలీవుడ్ క్రిటిక్ ఛాయస్ అవార్డ్స్ లో ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ మూవీ కేటగిరిలో ‘అవతార్‌2’ అవార్డు గెలుచుకుంది.

AP Minister Roja : అన్‌స్టాపబుల్‌ షోకి పిలిచినా వెళ్ళను.. అప్పుడే ఫిక్స్ అయ్యాను..

ఈ వేడుకలో కామెరూన్ మాట్లాడుతూ అవతార్ 3 గురించి హింట్ ఇచ్చారు. జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. అవతార్ 3 సినిమా అగ్నిని ఆధారంగా తీసుకొని జరుగుతుంది. అగ్ని ఒక చిహ్నం. కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అవతార్ 3లో మరో కొత్త సంసృతి పరిచయం అవుతుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదేమో అని అన్నారు. ఇక జేమ్స్ కామెరూన్ భార్య మాట్లాడుతూ.. అవతార్ 3 మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది అని తెలిపింది. హాలీవుడ్ మీడియా ప్రకారం అవతార్ 3 కథ ఒక మండే ఎడారిలో ఉండొచ్చని సమాచారం. దీంతో ఇప్పట్నుంచే అవతార్ 3 పై అంచనాలు నెలకొన్నాయి. ఇక అవతార్ 3ని 2024 డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.