HIT 2 : అడివిశేష్ ‘హిట్ సెకండ్ కేస్’ టీజర్ రిలీజ్..

Kaburulu

Kaburulu Desk

November 3, 2022 | 08:05 AM

HIT 2 : అడివిశేష్ ‘హిట్ సెకండ్ కేస్’ టీజర్ రిలీజ్..

HIT 2 :  విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో గతంలో వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి దాదాపు 7 సీక్వెల్స్ ఉంటాయని, ఒక్కో సినిమాలో ఒక్కో హీరో నటిస్తారని గతంలోనే చెప్పాడు దర్శకుడు. ప్రస్తుతం హిట్ సెకండ్ కేస్ సినిమాని అడివి శేష్ తో తెరకెక్కించారు. ఈ సినిమాని డిసెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇప్పట్నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్.

తాజాగా హిట్ సెకండ్ కేస్ టీజర్ ని రిలీజ్ చేశారు. అడివిశేష్ పోలీసాఫీసర్ గా, అడివి శేష్ క్యారెక్టర్ గురించి టీజర్ లో చూపించారు. టీజర్ మొత్తం అడివిశేష్ మీదే నడిచింది. టీజర్ చివర్లో ఒక అమ్మాయి మర్డర్ అయినట్టు చూపించి హిట్ సెకండ్ కేస్ మొదలవుతుంది అని చూపించారు. ఈ సినిమాలో ఆ అమ్మాయి మర్డర్ ఎలా అయింది అనే అంశం మీదే కథని చూపించనున్నట్టు తెలుస్తుంది.

Karate Kalyani : దేవిశ్రీ ప్రసాద్ పై ఫైర్ అయిన కరాటే కళ్యాణి.. పోలీసులకి ఫిర్యాదు..

హిట్ సెకండ్ కేస్ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు, ట్విస్ట్ లు ఉంటాయని తెలుస్తుంది. సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న అడివి శేష్ కి, నిర్మాతగా నానికి కూడా ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు.