Adipurush : మళ్ళీ వాయిదాపడిన ఆదిపురుష్.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

Kaburulu

Kaburulu Desk

November 7, 2022 | 07:37 AM

Adipurush : మళ్ళీ వాయిదాపడిన ఆదిపురుష్.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

Adipurush :  ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా మళ్ళీ వాయిదాపడింది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి.

కానీ ఇటీవల ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేయగా అన్ని వర్గాల నుండి చిత్ర యూనిట్ విమర్శల పాలైంది. రామాయణం చూపిస్తారనుకుంటే గ్రాఫిక్స్, బొమ్మల సినిమా చూపిస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే, రామాయణం అని చెప్పి అసలు దాన్ని ఆనవాళ్లు ఒక్కటి కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు సినిమా తీశారని హిందువులు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తేలిక చిత్ర యూనిట్ తలలు పట్టుకున్నారు.

Alia Bhatt : పాపకి జన్మనిచ్చిన అలియా భట్..

ఇప్పటికే పలుసార్లు వాయిదాపడిన ఆదిపురుష్ సినిమా మళ్ళీ సంక్రాంతి నుంచి 2023 జూన్ కి వాయిదా పడింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ తన సోషల్ మీడియాలో.. ఒక గొప్ప సినిమా తీస్తున్నాం. మన దేశ సంసృతి, చరిత్ర గురించి, రాముడి గురించి ఈ సినిమా. కాబట్టి ప్రేక్షకులకి మరింత అద్భుతంగా చూపించాలని విజువల్స్ కోసం ఇంకా కష్టపడుతున్నాం. జూన్ 16, 2023న ఈ సినిమాని రిలీజ్ చేస్తాము. మీ అందరి సపోర్ట్ కావాలి అని పోస్ట్ చేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.