Chiranjeevi : విశాఖలో స్థలం కొన్నా.. ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అవుతా.. చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్‌గా దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ మొదలు పెడుతూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Kaburulu

Kaburulu Desk

January 9, 2023 | 04:59 PM

Chiranjeevi : విశాఖలో స్థలం కొన్నా.. ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అవుతా.. చిరంజీవి!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్‌గా దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. కె బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ముఠామేస్త్రి తరువాత చిరు మళ్ళీ ఆ తరహా పాత్రలో కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

Chiranjeevi: మెల్లగా ఓపెన్ అవుతున్న మెగాస్టార్.. ఇక మిగిలింది జై జనసేన నినాదమే?

ఈ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ మొదలు పెడుతూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు. “దర్శకుడు బాబీ నా దగ్గరికి వచ్చి ఒక కథ ఉంది, టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని చెప్పినప్పుడు ఒక ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాను. ఆ తరువాత కథ విన్నాక సింగల్ సిట్టింగ్ లోనే ఓకే అయిపోయింది. నా కెరీర్ ఇలా సింగల్ సిట్టింగ్ అయిన సినిమాల్లో ఎక్కువ వైజాగ్ నేపథ్యంతో ఉన్నవే. అంతేకాదు అవి అన్ని బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. ఇప్పుడు ఇది కూడా అలాగే సక్సెస్ అవుతుంది.

ఇక వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఒక ఉద్వేగానికి లోనవుతాను. ఇక్కడ కల్చర్, నేచర్ ఎంతో బాగుంటాయి. ఇది ఒక స్వర్గధామంలా ఉంటుంది. ఇక్కడ జనం చాలా మంచి మనుసు ఉన్నవాళ్లు. రిటైర్ అయ్యాక ఇక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటారు ఎంతోమంది. అందులో నేను ఒకడిని. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఉంది అంటూ ఎన్నోసారులు చెప్పాను. కానీ ఇప్పుడు చెబుతున్నా.. నేను ఇటీవలే భీమిలి వెళ్లే దారిలో ఒక స్థలం కొనుక్కున్నాను. త్వరలోనే ఇక్కడ ఇల్లు కట్టుకొని సెటిల్ అవుతా” అంటూ వ్యాఖ్యలు చేశాడు. సినీ పరిశ్రమ వైజాగ్ రావాలి అంటూ ఏపీ నాయకులు అడుగుతున్నా సమయంలో చిరు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి టాలీవుడ్ విశాఖపట్నం వస్తుందా? లేదా? అనేది చూడాలి.