Chiranjeevi : ‘భోళాశంకర్’ గురించి అప్డేట్ ఇచ్చిన చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య' విడుదలకు సిద్ధమైంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో 'భోళాశంకర్' సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 07:02 PM

Chiranjeevi : ‘భోళాశంకర్’ గురించి అప్డేట్ ఇచ్చిన చిరంజీవి..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో చిరుతో పాటు మరో టాలీవుడ్ హీరో రవితేజ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో కథానాయక కేథ‌రిన్ థ్రెసా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. చిరు వింటేజ్ లుక్స్ దర్శనమిస్తున్న ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

Chiranjeevi: పక్క రాష్ట్రం రాజకీయాల గురించి నాకెందుకు?.. చిరు ఇంతమాట అనేశాడేంటి?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ‘భోళాశంకర్’ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న ఈ యాక్షన్ కామెడీ మూవీ.. ప్రస్తుతం చిత్రీకరణకు కొంచెం గ్యాప్ తీసుకుంది. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ పూర్తి అవ్వగానే ఈ సినిమా పట్టాలు ఎక్కించనున్నాడు చిరంజీవి. ఈ నెల 17న ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించాడు. శరవేగంగా షూటింగ్ జరిపి మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలియజేశాడు.

ఒకవేళ అప్పుడు కుదరలేదు అంటే దసరాకి రిలీజ్ చేస్తాము అని ప్రకటించాడు. కాగా ఈ సినిమా తమిళ సినిమా ‘వేదాళం’కి రీమేక్ తెరకెక్కుతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వేదాళం తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.