Chalapathi Rao : నిన్న కైకాల మరణంపై ట్వీట్.. నేడు అయన దగ్గరకే వెళ్లిపోయిన చలపతి..

Kaburulu

Kaburulu Desk

December 25, 2022 | 03:35 PM

Chalapathi Rao : నిన్న కైకాల మరణంపై ట్వీట్.. నేడు అయన దగ్గరకే వెళ్లిపోయిన చలపతి..

Chalapathi Rao : టాలీవుడ్‌లో వరుస మరణాలతో విషాదం చోటు చేసుకుంటుంది. ఈ శుక్రవారం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వర్గస్తులు అవ్వగా, నేడు మరో సీనియర్ నటుడు చలపతి రావు కూడా కన్నుమూశారు. అయన అకాల మరణంతో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం.. తమ కుటుంబ సభ్యుడిని కోలుపోయాము అంటున్నారు.

Chalapathi Rao : సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత..

అయితే చలపతి రావు నిన్నటి వరకు బాగానే ఆరోగ్యగానే ఉన్నారు. మొన్న కైకాల మరణ వార్త విన్న చలపతి ఆ విషయం గురించి ట్వీట్ కూడా చేశారు. “నువ్వు కూడా వెళ్లిపోయావా సత్యన్నా” అంటూ ఎన్టీఆర్ తో కైకాల ఉన్న ఫోటోని షేర్ చేశారు. కానీ ఇంతలోనే కైకాల వెనుకే చలపతి కూడా వెళ్ళిపోతారు అని ఎవరు ఊహించలేదు. ఇక ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా చలపతి మాట్లాడుతూనే, ఏ నొప్పి లేకుండా మరణించినట్లు అయన కుమారుడు రవిబాబు మీడియాకి తెలియజేశాడు. “నిన్న రాత్రి ఆయనకి ఇష్టమైన చికెన్ బిరియాని తిని, అయన చేతిలో ఉన్న ప్లేట్ ని పక్కనబెట్టి అలా ఊపిరి వదిలేశారు” అని పేర్కొన్నారు. చలపతి రావు కుమార్తెలు అమెరికాలో ఉండడంతో, వాళ్ళు వచ్చిన తరువాత బుధవారం నాడు అయనకి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.