BiggBoss 6 Second Week Nominations : రెండోవారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

September 13, 2022 | 12:36 PM

BiggBoss 6 Second Week Nominations : రెండోవారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా..?

BiggBoss 6 Second Week Nominations :  బిగ్ బాస్ 6 అప్పుడే మొదటివారం పూర్తయింది. అన్ని సీజన్లకంటే ఈ సారి కొత్తగా మొదటివారం ఎలిమినేషన్ తీసేయడంతో కంటెస్టెంట్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు. చివరివరకు నామినేషన్ లో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి చివర్లో ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు. ఇక రెండో వారం ప్రారంభమవగానే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం పూర్తయింది.

ఈ సారి నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు కేవలం ఒక్కర్ని మాత్రమే నామినేట్ చేయాలి. బిగ్ బాస్ ఇచ్చిన కుండల మీద ఎవర్ని నామినేట్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో పెట్టి దానిని బావిలో పడేసి ఎందుకు నామినేట్ చేశారో చెప్పాలని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో ఈ నామినేషన్స్ ప్రక్రియలో మళ్ళీ గొడవలు అయ్యాయి.

BiggBoss 6 Contestants List : బిగ్ బాస్ 6వ సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే.. వామ్మో 21 మంది.. టైటిల్ ఎవరు కొడతారో??

మొత్తానికి ఈ సారి నామినేషన్స్ లో అందరికంటే ఏక్కువ ఓట్లు పడ్డ రాజ్, షాని, అభినయ, రోహిత్-మెరీనా, ఆదిరెడ్డి, గీతూ, రేవంత్, ఫైమా ఉన్నారు. మొత్తం హౌస్ లో ఉన్న 21 మందిలో 9 మంది కంటెస్టెంట్స్ రెండోవారం నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం వీళ్లల్లో ఎవరు బాగా ఆడి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారో చూడాలి.