Balakrishna : వీరసింహుని విజయోత్సవ సభలో ఏపీ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ పంచులు వేసిన బాలయ్య..

బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను ఫ్యాక్షన్ సినిమాల్లో నటించి చాలాకాలమైంది. అందుకే డైరెక్టర్ గోపీచంద్ నాతో సినిమా చేద్దాం అన్నప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్...................

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 09:18 AM

Balakrishna : వీరసింహుని విజయోత్సవ సభలో ఏపీ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ పంచులు వేసిన బాలయ్య..

Balakrishna :  బాలకృష్ణ, శృతి హాసన్, హానీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహ రెడ్డి సినిమా సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. చిత్ర విజయంపై చిత్రయూనిట్, ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు.

తాజాగా వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. హైదరాబాద్ లో అభిమానుల మధ్య నిర్వహించిన ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కి చిత్రయూనిట్ తో పాటు యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్స్ హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, శివ నిర్వాణ కూడా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేశారు.

Singer Mangli: తెలుగు సినీ సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి.. అసలు ఏమైందంటే?

బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను ఫ్యాక్షన్ సినిమాల్లో నటించి చాలాకాలమైంది. అందుకే డైరెక్టర్ గోపీచంద్ నాతో సినిమా చేద్దాం అన్నప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేద్దాం అనుకోని ఒక డైలాగ్ నుంచి కథ పుట్టి సినిమా వచ్చింది. నా అభిమానిగా అలాంటి ఫ్యాక్షన్ సినిమా సమరసింహారెడ్డి సినిమా సమయంలో దెబ్బలు తిని పోలీసు స్టేషన్ కి వెళ్లి వచ్చాడు. ఇప్పుడు చెప్తే మళ్ళీ కేసు పెడతారేమో. ఇప్పుడు అక్కడ కేసులు పెట్టడం చాలా ఈజీగా. నిరపరాధులపై, అందరిపై కేసులు పెట్టడం మాములు అయిపోయిందిగా, సర్లే మళ్ళీ ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం ఎందుకు ఇక్కడి సభలో అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వానికి అని వైరల్ గా మారాయి.