Balakrishna : చలపతి రావుకి నివాళ్లు అర్పించిన బాలకృష్ణ..

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. చలపతి రావుకి నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయితే షూటింగ్లు కారణంగా చలపతిని చివరి చూపు చూసుకోలేకపోయారు నందమూరి హీరోలు. దీంతో నేడు చలపతి రావు పెద్ద దినం కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యి..

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 09:11 PM

Balakrishna : చలపతి రావుకి నివాళ్లు అర్పించిన బాలకృష్ణ..

Balakrishna : టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 1200 పైగా సినిమాలో నటించిన ఈ నటుడు.. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే చలపతి.. మరణించడం కూడా అలానే సరదాగా మాట్లాడుతూ హార్ట్ ఎటాక్‌తో మరణించారు.

Chalapathi Rao : నిన్న కైకాల మరణంపై ట్వీట్.. నేడు అయన దగ్గరకే వెళ్లిపోయిన చలపతి..

ఇక ఆయన మరణవార్త విన్న సినీప్రముఖులు ఆయనకి నివాళ్లు అర్పించారు. కాగా చలపతి రావుకి నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీంతో ఆయన మరణ వార్త విని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. అయితే షూటింగ్లు కారణంగా చలపతిని చివరి చూపు చూసుకోలేకపోయారు ఈ నందమూరి హీరోలు.

దీంతో నేడు చలపతి రావు పెద్ద దినం కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యి.. చలపతి రావుకి ఘన నివాళ్లు అర్పించాడు. అలాగే చలపతి కుమారుడు రవిబాబుని పరామర్శించి, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట హల చల్ చేస్తున్నాయి. కాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా అమెరికాలోనే ఉండడంతో ఈ కార్యక్రమానికి కూడా హాజరుకాలేకపోయాడు. అయితే రవిబాబుకి వీడియో కాల్ చేయడం ద్వారా చలపతి రావు భౌతికకాయాన్ని కడసారి చూసుకున్నాడు ఎన్టీఆర్.