AP Minister Roja : అన్‌స్టాపబుల్‌ షోకి పిలిచినా వెళ్ళను.. అప్పుడే ఫిక్స్ అయ్యాను..

అన్‌స్టాపబుల్‌ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ రావడం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం, త్వరలో పవన్ కళ్యాణ్ వస్తుండటంతో దీనికి పొలిటికల్ టచ్ వచ్చింది. అన్‌స్టాపబుల్‌ షోపై ఏపీలోని వైసీపీ నేతలు...............

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 06:03 PM

AP Minister Roja : అన్‌స్టాపబుల్‌ షోకి పిలిచినా వెళ్ళను.. అప్పుడే ఫిక్స్ అయ్యాను..

AP Minister Roja :  బాలకృష్ణ యాంకర్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ షో ఎంత సక్సెస్ గా రన్ అవుతుందో మనకి తెలిసిందే. అన్‌స్టాపబుల్‌ సీజన్ 1 కంటే కూడా సీజన్ 2 మరింత సక్సెస్ అవుతుంది. సీజన్ 2లో ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్స్ రావడంతో ఈ షో మరింత వైరల్ గా మారింది. త్వరలో పవన్ ఎపిసోడ్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఆహా.

అయితే అన్‌స్టాపబుల్‌ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ రావడం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం, త్వరలో పవన్ కళ్యాణ్ వస్తుండటంతో దీనికి పొలిటికల్ టచ్ వచ్చింది. అన్‌స్టాపబుల్‌ షోపై ఏపీలోని వైసీపీ నేతలు దారుణంగా విమర్శలు చేశారు. షో పైనే కాక, షోకి వచ్చిన వాళ్ళపైన కూడా వ్యాఖ్యలు చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 ఏపీలో బాగా చర్చగా మారింది. తాజాగా ఏపీ మంత్రి రోజా అన్‌స్టాపబుల్‌ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Hari Hara Veera Mallu : పవన్ ‘వీరమల్లు’ మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యిందా?

గత మూడు రోజులుగా ఏపీ మంత్రులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి రోజా పాల్గొంది. అక్కడ మీడియాతో రోజా మాట్లాడగా అన్‌స్టాపబుల్‌ షోకు వెళ్తారా అని అడిగారు. దీంతో రోజా.. గతంలో అన్‌స్టాపబుల్‌ షోకి వెళ్లాలని అనుకున్నాను. నేను, బాలకృష్ణ కలిసి ఏడు సినిమాలు చేశాము. మాది మంచి హిట్ పెయిర్. గతంలో నన్ను అన్‌స్టాపబుల్‌ షోకి పిలిచారు కానీ అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉండటంతో వెళ్లడం కుదరలేదు. కానీ మొన్న చంద్రబాబు ఎపిసోడ్ చూశాక, ఆ షోలో వాళ్ళు మాట్లాడిన అబద్దాలు చూశాక ఇంక చచ్చినా అన్‌స్టాపబుల్‌ కి వెళ్లకూడదని డిసైడ్ అయ్యాను. వాళ్ళు పిలిచినా కూడా నేను అన్‌స్టాపబుల్‌ షోకి వెళ్ళను అని తెలిపింది. మరి రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై ఎవరన్నా స్పందిస్తారేమో చూడాలి.