Anupama Parameswaran : రంగస్థలం సినిమాలో హీరోయిన్‌గా అనుపమ చేయాల్సింది.. సుకుమార్!

Anupama Parameswaran : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఎంతటి హిట్టు అయ్యిందో మనందరికి తెలుసు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో చరణ్ ఒక చెవిటి వాడి అయిన ‘చిట్టిబాబు’ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఒక పల్లెటూరి అమ్మాయి ‘రామలక్ష్మి’ పాత్రలో సమంత కనిపించి ఆకట్టుకుంది.
Ram Charan :రామ్‌చరణ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్?
కాగా నిన్న అనుపమ, నిఖిల్ నటించిన ’18 పేజిస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యిన సుకుమార్ ఆశక్తికర విషయాన్ని బయట పెట్టాడు. అదేంటంటే రంగస్థలంలో రామలక్ష్మి పాత్రకి ముందుగా అనుకున్నది సమంతని కాదంట. ఆ పాత్ర కోసం మొదటిగా అనుపమ పరమేశ్వరన్ ని పరిశీలించడంట సుకుమార్. అయితే ఆడిషన్ చేస్తున్న సమయంలో ఏమి అడిగిన అనుపమ భయంతో వాళ్ళ అమ్మ వైపు చూడడం చూసి తనకి భయం వేసిందని, ఆ తరువాత సమంతని తీసుకున్నామని సుకుమార్ వెల్లడించాడు.
దీంతో అనుపమ ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కాగా ఇదే వేదికపై దర్శకుడు సుకుమార్ అనుపమతో తప్పకుండా సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం పుష్ప 2 తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు.. తన తదుపరి ప్రాజెక్ట్ రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. అన్ని కుదిరితే అనుపమ ఈ సినిమాలోనే హీరోయిన్ గా ఛాన్స్ ఆదుకోవచ్చు.