Allu Arjun : కేంద్రమంత్రి చేతుల మీదుగా ఇండియన్ అఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

Kaburulu

Kaburulu Desk

October 13, 2022 | 01:08 PM

Allu Arjun : కేంద్రమంత్రి చేతుల మీదుగా ఇండియన్ అఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

Allu Arjun :  అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమాతో ఆలు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా బన్నీకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్, బన్నీ మేనరిజం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఇప్పటికి కూడా చాలా చోట్ల తగ్గేదేలే మేనరిజంతో ఎవరో ఒకరు చేయడం కనిపిస్తూనే ఉంటుంది.

ఇక పుష్ప సినిమాకి, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళకి, నటించిన వాళ్లకి ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. ఇటీవల సైమా, ఫిలింఫేర్ అవార్డుల్లో కూడా పుష్ప సినిమా తన సత్తా చాటింది. ఈ సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్ కి మరో అవార్డు వరించింది. CNN News18 ఇచ్చే ఇండియన్ అఫ్ ది ఇయర్ అవార్డు ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో అల్లు అర్జున్ ని వరించింది. ఈ అవార్డుకి రాజమౌళి, అలియాభట్, వివేక్ అగ్నిహోత్రి, కార్తీక్ ఆర్యన్ కూడా నామినేట్ అవ్వగా ఈ అవార్డు అల్లుఅర్జున్ ని దక్కింది.

Unstoppable 2 : ఓ వైపు ఎంటర్టైన్మెంట్.. ఓ వైపు పొలిటికల్.. అదిరిపోయిన అన్‌స్టాపబుల్‌ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో..

బుధవారం సాయంత్రం ఈ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. CNN News18 ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో ఇండియన్ అఫ్ ది ఇయర్ అవార్డుని అల్లు అర్జున్ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ అవార్డుని కరోనా సమయంలో ఎంతో కష్టపడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అంకితమిస్తున్నాను. ఇండియన్ సినిమాకి వచ్చిన అవార్డు ఇది అని తెలిపారు. అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు అల్లు అర్జున్ కి అభినందనలు తెలుపుతున్నారు.