Allu Aravind : ‘గీత ఆర్ట్స్’లో గీత అనే పేరు ఎవరిది? సీక్రెట్ బయటపెట్టిన అల్లు అరవింద్

Kaburulu

Kaburulu Desk

October 18, 2022 | 01:02 PM

Allu Aravind : ‘గీత ఆర్ట్స్’లో గీత అనే పేరు ఎవరిది? సీక్రెట్ బయటపెట్టిన అల్లు అరవింద్

Allu Aravind :  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో అలీ అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం చెప్పారు అల్లు అరవింద్. సినిమాల గురించి, కుటుంబ విషయాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో మీ గీత ఆర్ట్స్ సంస్థకి గీత అనే పేరు ఎవరిది అని అలీ అడగగా అల్లు అరవింద్ దానికి సమాధానం ఇచ్చారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ”గీతా ఆర్ట్స్ అనే పేరు మా నాన్న పెట్టారు. భగవద్గీతని ఉద్దేశించి నాన్న ఆ పేరు పెట్టారు. భగవద్గీతలో ప్రయత్నం చెయ్యి ఫలితం మన చేతిలో ఉండదు అని ఉంటుంది. సినిమాల్లో కూడా నిర్మాతగా నీ ప్రయత్నం చెయ్యి. ఫలితం మన చేతుల్లో ఉండదు, ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది” అన్నారు.

Samantha : నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మొదటిసినిమా.. యశోద రిలీజ్ డేట్ ఫిక్స్..

అయితే అలీ పెళ్లయ్యాక సంస్థ పేరు మీ భార్య మీద నిర్మల ఆర్ట్స్ అని పెట్టొచ్చు కదా అని అడగగా అల్లు అరవింద్.. ”గీత్ ఆర్ట్స్ లో చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అందుకే దాని పేరు మార్చాలని అనుకోలేదు. అలాగే నేను చదువుకునే రోజుల్లో గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అందుకే ఆ పేరు మార్చలేదు” అని సీక్రెట్ బయటపెట్టారు.