Prabhas : ప్రభాస్ ఫ్యాన్ కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేసిన ఆహా..

Kaburulu

Kaburulu Desk

December 18, 2022 | 06:47 PM

Prabhas : ప్రభాస్ ఫ్యాన్ కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేసిన ఆహా..

Prabhas : బాహుబలి ప్రభాస్ బాలయ్యతో ముచ్చటలు పెట్టేందుకు అన్‌స్టాపబుల్ షోకి వస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి టాలీవుడ్ అభిమానుల్లో.. ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్ ని చూస్తామా? అనే ఆశ మొదలయింది. ఇక ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలను విడుదల చేయగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోకి ఒక కోటి వ్యూస్, లక్ష లైక్స్ తో యూట్యూబ్ ట్రేండింగ్ లో ఉంది.

Prabhas Unstoppable episode released in theaters..

ఇక ఈ ప్రోమోలో ప్రభాస్ ని చూసిన డార్లింగ్ అభిమానుల అయితే ఎమోషనల్ అవుతున్నారు. విషయం ఏంటంటే, ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ లుక్స్, అతని చలాకితనం ఒక్కపాటి ప్రభాస్ ని గుర్తు చేశాయి. గత కొంతకాలంగా రెబల్ స్టార్ సినిమాల్లో.. వింటేజ్ ప్రభాస్ ని మిస్ అవుతున్నాము అంటూ బాధపడ్డారు అభిమానులు.

అయితే వారి బాధని బాలయ్య అన్‌స్టాపబుల్ తో తీర్చేసాడు. దీంతో సోషల్ మీడియాలో ‘వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్’ అంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వీడియోని ఎడిట్ చేసి షేర్ చేశాడు ఒక అభిమాని. అది చూసిన ఆహా టీమ్.. ఇది ఎడిట్ చేసిన వాళ్ళు మాకు మెసేజ్ చేయండి, వాళ్ళకి ఆహా ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాగా ఆ అభిమాని పేరు ‘వేణు’.