Prabhas : ఆ సినిమా చూశాక యాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యా.. ప్రభాస్!

ప్రభాస్ అన్‌స్టాపబుల్ సెకండ్ పార్ట్ కూడా వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య, ప్రభాస్, గోపీచంద్ కలిసి ఫుల్ గా నవ్వించారు. ఇక ఈ సెకండ్ పార్ట్ లో ప్రభాస్‌ని బాలయ్య.. నీకు యాక్టర్ అవుదామని ఎప్పుడు అనిపించింది అని ప్రశ్నించాడు.

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 04:22 PM

Prabhas : ఆ సినిమా చూశాక యాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యా.. ప్రభాస్!

Prabhas : టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్‌ని మిస్ అవుతున్న ఎంతోమంది అభిమానులకు మళ్ళీ వింటేజ్ ప్రభాస్‌ని చూపించిన షో.. బాలయ్య అన్‌స్టాపబుల్. ఈ షోకి ప్రభాస్ వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్‌స్టాపబుల్ షోకి విపరీతమైన రీచ్ వచ్చింది. మరి అంత హైప్ ఉన్న ఎపిసోడ్ ని నార్మల్ గా ప్లాన్ చేస్తే సరిపోదుగా, అందుకే రెండు ఎపిసోడ్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్‌ పార్ట్-2 ప్రోమో వచ్చేసింది..

న్యూ ఇయర్ టైంలో మొదటి భాగాన్ని రిలీజ్ చేసిన షో నిర్వాహకులు.. నేడు సెకండ్ పార్ట్ ని కూడా విడుదల చేశారు. ఈ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. దీంతో బాలయ్య ఈ ఇద్దరి స్నేహితులతో కలిసి సెకండ్ పార్ట్ ని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా సాగించాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ని బాలయ్య.. ‘నీకు యాక్టర్ అవుదామని ఎప్పుడు అనిపించింది. ఆ విషయం ముందుగా ఎవరికి చెప్పావు’ అంటూ అడిగాడు.

ప్రభాస్ బదులిస్తూ.. ‘నా 18 ఇయర్స్ ఉన్నపుడు అనుకుంటా పెదనాన్న గారి భక్త కన్నప్ప సినిమా చూశాను. అది నాకు బాగా నచ్చేసింది. అప్పుడు అనిపించింది నాకు యాక్టర్ అవ్వాలని. కానీ నాకు ఉన్న మొహమాటం, సిగ్గు వల్ల అది అవుతుందా అనుకున్నా? అలా కొన్నిరోజుల తరువాత ప్రమోద్ కి చెప్పడం, వాడు ఇంటిలో వాళ్లకి చెప్పడం, అది పెదనాన్న వరకు వెళ్ళింది. నేను ఏ యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళలేదు. B com చదువుతున్న సమయంలోనే చదువు మధ్యలో ఆపేసి యాక్టింగ్ వైపు వచ్చా’ అని తెలియజేశాడు.