Ira Khan : అమీర్‌ఖాన్ కూతురికి పబ్లిక్‌గా ప్రపోజ్ చేసి కిస్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

Kaburulu

Kaburulu Desk

September 23, 2022 | 08:59 AM

Ira Khan : అమీర్‌ఖాన్ కూతురికి పబ్లిక్‌గా ప్రపోజ్ చేసి కిస్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

Ira Khan :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురిగా ఐరాఖాన్ అందరికి పరిచయమే. సోషల్ మీడియాలో తాను చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్ని బికినీలో చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెద్ద రచ్చే చేసింది.

ఇక ఐరాఖాన్ నుపుర్ శిఖర్ అనే ఓ సైక్లిస్ట్ తో గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తుంది. వీరిద్దరూ కలిసి గతంలో చాలా సార్లు మీడియా కంటపడ్డారు. ఐరాఖాన్ కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా వీరిద్దరూ కలిసి అందరికి షాకిచ్చారు.

Gauri Khan : మొదటిసారి ఆర్యన్ డ్రగ్ కేసుపై మాట్లాడిన షారుఖ్ భార్య..

నుపుర్ శిఖర్ పాల్గొనే ఓ సైక్లింగ్ ఈవెంట్ కి ఐరాఖాన్ వెళ్లగా ఆ ఈవెంట్లో నుపుర్ మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో ఐరా ఓకే చెప్పి బాయ్ ఫ్రెండ్ కి అందరిముందు లిప్ కిస్ ఇచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక వీళ్ళిద్దరూ ఈ వీడియోని తమ సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేసి అందరికి తాము పెళ్లిచేసుకోబోతున్నట్టు అధికారికంగా హింట్ ఇచ్చేశారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ అంతా వీరికి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అమీర్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.